హోమ్ ఆరోగ్యం సంక్షేమం Wellness | Published: Friday, August 5, 2022, 16:03 [IST] Viral Fevers: జ్వరం.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికైనా జ్వరం వచ్చిందని అంటున్నారు. కొన్ని ఇళ్లలో అయితే చాలా మంది జ్వర బాధితులు ఉన్నారు. వాతావరణ మార్పులు వస్తుండటంతో జ్వరాలు చుట్టు ముడుతున్నాయి. మలేరియా, డెంగీ, ఫ్లూ అన్ని వ్యాధుల మొదటి లక్షణం జ్వరమే అయినా.. వాటిలో చిన్న పాటి తేడాలు మాత్రం ఉంటాయి. వాటిని గమనిస్తూ దానికి తగ్గట్లుగా చికిత్స అందిస్తే మలేరియా, ఫ్లూ, డెంగీ రోగాల నుండి బయట పడవచ్చు. అయితే వాటి మధ్య తేడాలు గమనించడం ఎలాగో, వాటి చికిత్స ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. డెంగీ(Dengue): వర్షాకాలం మొదలై వానలు కురవడం ప్రారంభం కాగానే డెంగీ చాలా మందిని చుట్టుముడుతుంది. ఈడిస్ జాతి దోమలు కుట్టడం ద్వారా డెంగీ వస్తుంది. డెంగీ లక్షణాలు(Dengue Symptoms): జ్వరం తీవ్రంగా వస్తుంది. విపరీతమైన తలనొప్పి, కాళ్ల నొప్పి, ఒళ్లు నొప్పులు వేధిస్తాయి. వాంతి, వికారం కలుగుతుంది. ఆకలి వేయదు. కడుపు నొప్పి, … [Read more...] about Viral Fevers: ప్రతి ఇంటా జ్వరమే.. ఈ జాగ్రత్తలు మేలు చేస్తాయి