• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Health Breaking News

  • Home
  • Health
  • Beauty
  • Psychology
  • Fitness
  • Food
  • Sleep
  • Mindfulness
  • Relationships

World Heart Day 2022: గుండె ఆరోగ్యానికి ఏమేం తినాలో.. ఏమేం తినవద్దో తెలుసా?

September 24, 2022 by telugu.boldsky.com

హోమ్

bredcrumb

ఆరోగ్యం

bredcrumb

సంక్షేమం

Wellness
| Published: Saturday, September 24, 2022, 14:56 [IST]

World Heart Day 2022: ప్రతీ మనిషి యొక్క గుండె ఆరోగ్యం వారి వారి ఆహారపు అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే మంచి ఆహారమే మనల్ని ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తుంది. కొన్నిసార్లు సరైన ఆహారం దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటాం. మనకు కోట్ల ఆస్తి ఉన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఏమీ చేయలేము. డబ్బున్న వాళ్లకు మంచి ఆహారం కంటే ప్రాసెస్ చేయడిన, అధిక క్యాలరీలతో కూడిన ఆహారమే ఎక్కువగా దొరుకుతుంటుంది. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుంది. అలాగే అంతిమంగా ప్రాణాంతక గుండె జబ్బులను కూడా వృద్ధి చేస్తుంది.

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మీ ప్రధాన భోజనంగా మీరు ఏమి తింటున్నారో, తాగుతున్నారో వాటిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే వాటిపై చాలా జాగ్రత్త వహించాలి. శీతల పానీయాలు, పండ్ల రసాలు, టీ, కాఫీలు… డ్రై ఫ్రూట్స్, హోల్‌గ్రెయిన్ ఫుడ్స్ లేదా గ్రీన్ వెజిటేబుల్స్ తింటారు చాలా మంది. కానీ మీరు తినే ఆహారం మీ గుండెపై ప్రభావం చూపుతుంది. ఆహారం గుండె ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే పేలవమైన లేదా అసమతుల్య ఆహారం మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. వాస్తవానికి కొన్ని ఆహారాలు రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు వాపును ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ గుండె జబ్బులకు ప్రమాద కారకాలు. ఈ వరల్డ్ హార్ట్ డే 2022 రోజున మెరుగైన గుండె ఆరోగ్యం కోసం మనం తినేవాటిని మరియు దూరంగా ఉంచాల్సిన ఆహారపదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార నిపుణులు సూచించిన చిట్కాలు ఫాలో అవుతూ గుండె ఆరోగ్యాన్ని ఇలా బాగు చేసుకుందాం.

గుండె ఆరోగ్యానికి తప్పనిసరిగా ఆహారాలు…

1. నానబెట్టిన బాదం..

ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదంపప్పులు మంచి గుండె ఆరోగ్యానికి కీలకం. ఆరోగ్యకరమైన ఆహారంలో బాదాన్ని చేర్చడం చాలా మంచిది. బాదం శరీరం మొత్తంలో ఉన్న, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

అలాగే గుండెకు హాని కలిగించే మంట స్థాయిలను తగ్గిస్తుంది. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమై భారతీయ పోషకాహారం మరియు హృదయ సంబంధ నిపుణుల బృందం చేసిన సమీక్ష ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. ప్రతి రోజూ బాదం పప్పును తీసుకోవడం వల్ల భారతీయులలో హృదయ సంబంధ వ్యాధులకు అత్యంత ముఖ్యమైన ప్రమాద కారకాల్లో ఒకటైన డైస్లిపిడెమియాను తగ్గించవచ్చని సూచించింది.

జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, మొత్తం ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా రోజువారీ 42 గ్రాముల బాదం పప్పులను తీసుకుంటే, అనేక గుండె జబ్బుల ప్రమాద కారకాలు మెరుగుపడతాయి. ఈ విధంగా ప్రతి రోజూ కొన్ని బాదం పప్పులను అల్పాహారంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. మీరు బాదంపప్పును ప్రీ-వర్కౌట్ స్నాక్‌గా లేదా ఆరోగ్యకరమైన నిద్రవేళ స్నాక్‌గా తీసుకోవడం అలవాటు చేసుకోవచ్చు. బాదం పప్పులు ప్రయాణంలో కూడా సులభంగా తీసుకువెళ్లి తినవచ్చు.

2. ఆకుపచ్చ కూరగాయలు..

ఆకుపచ్చ ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారంలో రెండు మూడు సార్లు అయినా మీరు ఆకకూర తినాల్సిందేనని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరలు ఎక్కువగ0/p>

3. తృణధాన్యాలు..

మీ భోజనంలో కచ్చితంగా తృణధాన్యాలు చేర్చండి. తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజుకు మూడు అదనపు తృణ ధాన్యాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 22% తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో, హోల్ వీట్ రకాల్లో వచ్చే అనేక కార్బోహైడ్రేట్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అదనంగా, సెలీనియం, థయామిన్ (విటమిన్ B1), రిబోఫ్లావిన్ (విటమిన్ B2), నియాసిన్ (విటమిన్ B3), ఫోలేట్ (విటమిన్ B9), మెగ్నీషియం మరియు ఇనుముతో సహా విటమిన్లు మరియు ఖనిజాల సంపద తరచుగా ఉంటాయి.

తినకూడని ఆహారాలు..

1. ప్రాసెస్ చేసిన మాంసం…

ప్రాసెస్ చేసిన మాంసాహారాలకు వీలైనంత దూరంగా ఉండండి. ప్రాసెస్ చేసిన మాంసం మరియు నైట్రేట్ వంటి ప్రిజర్వేటివ్‌లు ఊపిరితిత్తులకు హానికరం. అదనంగా అవి ఊబకాయానికి కూడా కారణమవుతాయి. ఉప్పు, నైట్రేట్లు లేదా ఇతర సంరక్షణకారులతో భద్ర పరచబడిన మాంసాలను ప్రాసెస్ చేసిన మాంసాలుగా పరిగణిస్తారు. ప్రాసెస్ చేసిన మాంసాలు గుండెకు అత్యంత హానికరమని దీర్ఘ కాలిక పరిశీలనా పరిశోధనలు సూచిస్తున్నాయి.

2. ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని అస్సలే తినొద్దు..

ప్యాంట్రీలో ఉన్న అన్ని ప్యాక్ చేసిన ఆహారాన్ని అస్సలే తినకూడదు. 10% ఎక్కువ అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, కరోనరీ హార్ట్ డిసీజ్ మరియు సెరెబ్రోవాస్కులర్ వ్యాధులు వచ్చే ప్రమాదం 10% లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుందని కనుగొనబడింది. విస్తృతమైన ప్రాసెసింగ్‌కు గురైన ఆహారాలు తరచుగా హానికరమైన చక్కెర, సోడియం మరియు కొవ్వును కలిగి ఉంటాయి. ఈ పదార్ధాలు మనం తినే ఆహారం యొక్క రుచిని మెరుగుపరుస్తాయి కానీ వాటిని ఎక్కువగా చేర్చడం వలన ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి ప1/p>

3. ఎరేటెడ్, చక్కెర పానీయాలు తీసుకోవద్దు..

ఏ రకమైన ఎరేటెడ్, చక్కెర పానీయాలు తీసుకోవడం మానేయడం మంచిది. అత్యంత ప్రాసెస్ చేయబడిన మరియు శుద్ధి చేసిన పిండి పదార్థాలు చేసే విధంగానే చక్కెర పానీయాలు గుండెకు హాని చేస్తాయి. చక్కెర పానీయాలు అధిక శుద్ధి మరియు ప్రాసెస్ చేయబడిన పిండి పదార్ధాల ఇతర ప్రతికూల ప్రభావాలకు అదనంగా బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతాయి.

Comments
More WORLD HEART DAY News
  • ఈ వారం మీ రాశి ఫలాలు- సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 5 వరకు
  • ఈ చిన్న మార్పులతో గుండె పోటు వచ్చే అవకాశం ఉండదు
  • చేపలు తింటే ఆరోగ్యానికి 10 అద్భుత లాభాలు
  • నిద్రలేమి కారణంగా ఆరోగ్యంపై 11 దుష్ప్రభావాలు
  • ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల 7 ఫ్యాసినేటింగ్ హెల్త్ బెనిఫిట్స్
  • కీటో డైట్ : కీటో డైట్ పాటించే ముందు ఈ 6 దుష్ప్రభావాల గురించిన అవగాహన ముఖ్యం
  • రోజుకో కోడిగుడ్డు తినేవారిలో గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది
  • రెడ్ వైన్ కి చెందిన ఈ 10 ముఖ్యమైన వాస్తవాలు మిమ్మల్ని అమితాశ్చర్యానికి గురిచేస్తాయి.
  • నువ్వులనూనె యొక్క 8 ఆరోగ్య లాభాలు
  • విటమిన్ బి 1 అధికంగా వున్న ఇండియన్ ఫుడ్స్ మరియు వాటి బెనిఫిట్స్!
  • దుర్గా పూజ సమయంలో మీ గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి మార్గాలు ఇవే
  • మీ హృదయ స్పందన, మీ ఆరోగ్యం గురించి ఏమి చెబుతుంది

GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed

Read more about: world heart day heart day 2022 heart health food of heart avoid for heart heart health foods heart and health గుండె ఆరోగ్యానికి ఆహారం ఆహారపదార్థాలు గుండె ఆరోగ్యం ప్రపంచ హృదయ దినోత్సవం హృదయ ద

English summary

World Heart Day 2022: what to eat and what not to eat for heart health in Telugu

read on to know World Heart Day 2022: what to eat and what not to eat for heart health in Telugu

Story first published: Saturday, September 24, 2022, 14:56 [IST]
Sep 24, 2022 లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి

  • MLB Computer Power Ranking: Yankees With Cole Still Behind Astros
  • The 100 Best Movies to Watch on Netflix Right Now
  • Dealmaster: A ton of Amazon Kindle, Echo, and Fire devices are on sale today
  • Caroll Spinney, the Sesame Street puppeteer behind Big Bird and Oscar the Grouch, has died
  • The Verge’s gadgets of the decade
World Heart Day 2022: గుండె ఆరోగ్యానికి ఏమేం తినాలో.. ఏమేం తినవద్దో తెలుసా? have 154 words, post on telugu.boldsky.com at September 24, 2022. This is cached page on Health Breaking News. If you want remove this page, please contact us.

Filed Under: Health world heart day, heart day 2022, heart health, food of heart, avoid for heart, heart health foods, heart and health, గుండె ఆరోగ్యానికి ఆహారం, ఆహారపదార్థాలు..., worlds aids day, World Poetry Day, world aids day, World Autism Day, world toilet day, World Parrot Day, World cities day, World Backup Day, world youth day, world diabetes day, World Bipolar Day, world refugee day, The World Water Day, The World Environment Day, world environment day, United Nations World Environment Day, World Environment Day June 5th, world book day, World Tuberculosis Day, world youth day 2022

Primary Sidebar

RSS Recent Stories

Sponsored Links

Copyright © 2023 Health Breaking News. Power by Wordpress.
Home - About Us - Contact Us - Disclaimers - DMCA - Privacy Policy - Submit your story