Viral Fevers: జ్వరం.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరికైనా జ్వరం వచ్చిందని అంటున్నారు. కొన్ని ఇళ్లలో అయితే చాలా మంది జ్వర బాధితులు ఉన్నారు. వాతావరణ మార్పులు వస్తుండటంతో జ్వరాలు చుట్టు ముడుతున్నాయి.
మలేరియా, డెంగీ, ఫ్లూ అన్ని వ్యాధుల మొదటి లక్షణం జ్వరమే అయినా.. వాటిలో చిన్న పాటి తేడాలు మాత్రం ఉంటాయి. వాటిని గమనిస్తూ దానికి తగ్గట్లుగా చికిత్స అందిస్తే మలేరియా, ఫ్లూ, డెంగీ రోగాల నుండి బయట పడవచ్చు. అయితే వాటి మధ్య తేడాలు గమనించడం ఎలాగో, వాటి చికిత్స ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
డెంగీ(Dengue):
వర్షాకాలం మొదలై వానలు కురవడం ప్రారంభం కాగానే డెంగీ చాలా మందిని చుట్టుముడుతుంది. ఈడిస్ జాతి దోమలు కుట్టడం ద్వారా డెంగీ వస్తుంది.
డెంగీ లక్షణాలు(Dengue Symptoms):
జ్వరం తీవ్రంగా వస్తుంది. విపరీతమైన తలనొప్పి, కాళ్ల నొప్పి, ఒళ్లు నొప్పులు వేధిస్తాయి. వాంతి, వికారం కలుగుతుంది. ఆకలి వేయదు. కడుపు నొప్పి, పొట్టలో లేదా చాతిలో నీరు చేరుతుంది. చిగుళ్ల వంటి జిగురు పొరల నుండి రక్తం వస్తుంది. చర్మంపై మచ్చలు, బీపీ పడిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, నిస్సత్తువ, రక్తంలో హిమోగ్లోబిన్ పడిపోవడం లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ సోకిన చాలా మందిలో రక్తంలోని ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోతుంది.
మలేరియా(Malaria):
ఇది దోమల నుండి వ్యాప్తి చెందుతుంది. మలేరియా ఉన్న వారిని కుట్టిన దోమలు మరో వ్యక్తిని కుడితే మలేరియా వ్యాపిస్తుంది. అందుకే ఇంట్లో ఒకరికి మలేరియా వస్తే ఇంటిల్లిపాది దాని బారిన పడతారు.
మలేరియా లక్షణాలు(Malaria Symptoms)
:మలేరియా సోకిన వ్యక్తులకు విపరీతమైన చలి పెడుతుంది. వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. మలేరియా సోకిన కొందరిలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు వస్తాయి. చిన్న పిల్లల్లో నీళ్ల విరేచనాలు వస్తాయి. మలేరియా ముదిరితే కామెర్లు, రక్త హీనత సమస్యలు చుట్టుముడతాయి. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అవుతాయి. దీని వల్ల హిమోగ్లోబిన్ కిడ్నీల ద్వారా బయటకు వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మూత్రం రంగు మారుతుంది. నీళ్లులాగా, లేత పసుపు రంగులో రావాల్సిన మూత్రం నల్లగా వస్తుంది.
కరోనా(Covid-19):
రెండు, మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా మహమ్మారి. కరోనా వచ్చిన వారిలో ముఖ్యంగా కనిపించే లక్షణం జ్వరం. జ్వరంతో పాటు మరికొన్ని లక్షణాలు కనిపించినప్పటికీ.. చాలా మందిలో మొదట జ్వరమే కనిపించింది.
కరోనా లక్షణాలు(Covid-19 Symptoms):
కరోనా వైరస్ ఒంట్లోకి ప్రవేశించగానే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఆ వైరస్ పై పోరాడుతుంది. అప్పుడు జ్వరం వస్తుంది. దగ్గు, ముక్కు దిబ్బడ లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీటితో పాటు తీవ్ర అలసటగా ఉంటుంది. కాళ్లు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. చాలా మంది రుచి, వాసన కోల్పోతారు. మలేరియా, డెంగీ, ఫ్లూ వస్తే రుచి, వాసన కోల్పోవడం ఉండదు. కరోనా తీవ్రమైతే ఆయాసం వస్తుంది. శ్వాస సరిగ్గా ఆడదు. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
కరోనా సోకితే చికిత్స(Covid-19 Treatment):
కరోనా వైరస్ పై పోరాడేందుకు టీకాలు ఉన్నప్పటికీ… కరోనా సోకితే మాత్రం ప్రత్యేకంగా మందులు ఏమీ ఇప /p>
ఫ్లూ(Flu):
ఫ్లూ వైరస్ ల కారణంగా ఫ్లూ జ్వరాలు వస్తాయి. సాధారణ జలుబు మాదిరిగానే అనిపిస్తుంది ఫ్లూ సోకినప్పుడు. ఫ్లూ వైరస్ లు ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల మీద దాడి చేస్తాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. ఈ ఫ్లూలు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొందరిలో మాత్రం సమస్య తీవ్రంగా ఉంటుంది. చిన్న పిల్లలకు, వృద్ధులకు, గర్భిణీలకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఫ్లూ వైరస్ సోకితే లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. మామూలు వ్యక్తుల్లో అయితే ఫ్లూపై శరీరంలోని రోగ నిరోధక శక్తి దాడి చేసి ఫ్లూ ను తగ్గిస్తుంది.
ఫ్లూ లక్షణాలు(Flu Symptoms):
ఫ్లూ వైరస్ సోకినప్పుడు జ్వరం వస్తుంది. ఈ జ్వరం 101 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుంది. కొందరిలో ఒళ్లు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి కూడా ఉండొచ్చు. దగ్గు పొడిగా వస్తుంది. కొందరిలో శ్వాస సరిగ్గా ఆడదు. మరికొందరిలో అలసట, నిస్సత్తువ, ముక్కు కారటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు ఉంటాయి.
టైఫాయిడ్(Typhoid):
టైఫాయిడ్ చాలా మందిలో చాలా తరచుగా వస్తుంది. సీజన్ మారినప్పుడు మొదట సోకేది టైఫాయిడ్. కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది టైఫాయిడ్. టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుంది.
టైఫాయిడ్ లక్షణాలు(Typhoid Symptoms):
టైఫాయిడ్ వస్తే జ్వరం అస్సలు విడిచిపెట్టదు. 103 నుండి 104 వరకు కూడా జ్వరం వస్తుంది. విరేచనాలు, ఆకలి లేకపోవడం, వాంతులు, ఒళ్లు నొప్పులు, నీరసం వంటివి ప్రతి ఒక్కరిలో కనిపించే లక్షణాలు.
Read more about: seasonal fever viral fever viral infections మలేరియా డెంగీ ఫ్లూ టైఫాయిడ్ వైరల్ జ్వరాలు సీజనల్ జ్వరాలు
Tips to Prevent fever, infections like malaria, dengue, flu in telugu
read on to know Tips to Prevent fever, infections like malaria, dengue, flu in telugu
- Ask an Opposing Beat Writer: Miami at Virginia Tech
- Pop quiz with TE Jace Sternberger
- Aggies take break from SEC play to host surging Blazers tonight
Viral Fevers: ప్రతి ఇంటా జ్వరమే.. ఈ జాగ్రత్తలు మేలు చేస్తాయి have 115 words, post on telugu.boldsky.com at August 5, 2022. This is cached page on Health Breaking News. If you want remove this page, please contact us.