తెలంగాణలో మరికొన్ని గంట్లలో మరో పెద్ద పండుగ షురు కాబోతున్నది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగల్లో ఒకటైన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బోనాల పండుగ అంటే తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికీ మంచిగా తెలుసు.
ఇప్పుడంటే భాగ్యనగరంలో బోనాలు బాగా ఫేమస్ అయినయి గానీ.. అప్పట్లో ప్రతి ఊళ్లోనూ ఈ పండుగను మస్తుగా జరుపుకునేటోళ్లు. ఇప్పుడేమో తెలంగాణ సర్కారు ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజున బోనాలు పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే 2022లో జూన్ 30వ తేదీ నుండి ఈ సంబురాలు ప్రారంభమవుతున్నాయి.
బోనాల ఉత్సవాల్లో భాగంగా తొలి బోనం గోల్కోండ కోటలో ఎత్తుతరు. ఆ తర్వాతనే మిగిలిన ప్రాంతాల్లో బోనం ఎత్తుకోవాలనే ఆచారం ఆనాది కాలం నుంచి వస్తోంది. ఈ సందర్భంగా గోల్కోండలోనే తొలి బోనం ఎందుకు ఎత్తుకుంటారు.. రెండో బోనం ఎప్పుడు ఎక్కడ ఎత్తుకుంటారు.. అసలు బోనం అంటే ఏమిటి.. బోనాల పూజా విధానం, బోనాల ఆచారాలు, ప్రాముఖ్యతకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
బోనం అంటే..
బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించేదే బోనం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఊళ్లలోనూ గ్రామ దేవతలైనా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఇలా ఏడుగురు అక్కా చెల్లెళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ దేవతలకు మట్టి కుండలో తయారుచేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. వీరికి పోతురాజు అనే తమ్ముడు కూడా ఉండేవాడని పెద్దలు చెబుతుంటారు.
జగదాంబిక ఆలయంలో..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని గోల్కోండ కోటలోని జగదాంబిక ఆలయంలో తొలి బోనం ఎత్తుకుని బైలెల్లిపోతారు. ఆ తర్వాత జంట నగరాల్లో బోనాల సంబురాలు స్టార్ట్ అవుతాయి. ఈ ఏడాది అంటే 2022లో జూన్ 30వ తేదీన అంటే గురువారం రోజున బోనాలు ప్రారంభం కానున్నాయి.
వెయ్యేళ్ల చరిత్ర..
తెలంగాణలో జరిగే బోనాల పండుగకు సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. చరిత్రను పరిశీలిస్తే.. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు పండితులు చెబతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం పాలకులు సైతం ఇక్కడ పూజలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చారు. భాగ్యనగరంలోని అమ్మవారి అతి పురాతన ఆలయంగా జగందాంబిక ఆలయం. అందుకే ఇక్కడ తొలి బోనం సమర్పిస్తారు.
రేణుక ఎల్లమ్మ గుడిలో..
భాగ్యనగరంలో బల్కంపేట రేణుక ఎలమ్మ ఆలయంలో రెండో బోనాన్ని ఎత్తుకుని బైలెల్లిపోతరు. మూడో వారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు. చరిత్ర ప్రకారం.. బ్రిటీష్ కాలంలో ఇదే ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి బ్రిటీష్ సైన్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలోనే హైదరాబాదులో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. ఆ వార్త తెలిసిన అతను, తన సహోద్యోగులు కలిసి ఉజ్జయిన0/p>
అమ్మవారు పుట్టింటికి..
బోనాల పండుగ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలా మంది నమ్ముతారు. అందుకే బోనాన్ని వండి అమ్మవారికి నివేదించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో బోనం సమర్పిస్తారు. దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆషాఢమంటేనే వానకాలం. ఈ కాలంలో ఏవేవో రోగాలు ప్రబలుతుంటాయి. అవన్నీ రాకుండా మా పిల్లల్ని సల్లంగా సూడు తల్లీ అని అమ్మకు మొక్కేందుకే బోనం పండుగ చేసుకుంటారు. బోనం కుండకు పసుపు పూస్తరు. వేప ఆకులు కడ్తరు. వీటి వల్ల బ్యాక్టీరియా, వైరస్ ను చనిపోతాయి.
అమ్మవారిని శాంతపరచేందుకే..
పూర్వకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు అంటువ్యాధులనేవి అమ్మవారు కోప్పడితేనే వస్తాయని ఆమెను శాంతపరచాలని బోనాల పండుగను గతంలో గోల్కొండ కోట దగ్గర ప్రారంభించారంట. కాకతీయులు ఈ ఆచారాన్ని తొలిసారిగా ప్రారంభించారట. అమ్మవారి ఎదుట అన్నంపోసి తల్లీ ఎలాంటి రోగాలు రాకుండా మమ్మల్ని సుభిక్షింగా చూడు అని వేడుకునేటోళ్లు. అలా చేయడం వల్లే అమ్మవార్లు మనల్ని కాపాడుతున్నారని ఒక నమ్మకం.
నెల రోజుల పాటు..
ఏడుగురు అక్కాచెల్లెళ్ల అమ్మవార్ల తమ్ముడే పోతురాజు. ఈ పోతురాజుతోనే జాతర ప్రారంభమవుతుంది. ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి మూసీనదిలో నిమజ్జనం చేస్తారు. బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరీ ఆలయం ఎదురుగా వివాహం కానీ ఓ స్త్రీ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది.. దీన్నే రంగం అంటారు. ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
Read more about: spirituality rituals festival bonalu significance ఆధ్యాత్మికత ఆచారాలు పండుగ బోనాలు ప్రాముఖ్యత
Ashada Bonalu 2022 in Telangana : Check Dates, History, Time, Rituals, Puja Vidhi and Significance
Here we are talking about the Asada Bonalu 2022 in Telangana:Check dates, history, time, rituals, puja vidhi and significance in Telugu
- Vitamin B1 - Thiamine Benefits, Deficiency and Sources
- Why Should You Take Vitamin B?
- Vitamin B Rich Foods
- Vitamins and Mineral Electrolytes for Sports Performance
- Parrondo's Paradox
- How To Handle A Lay Off In USA - For the H1-B Visa Holder
- Vitamin B What Is It & How It Can Help You
- Taking Care of Your Eyes and Bones
- Fantasy hockey rankings: Week 3 update
- History Of UK Car Registration System
- Fantasy Football Preview - WR Rankings
- How To Use Labels In Microsoft Excel 2003 To Sum Cells
- Vitamin For Acne Guide - Which Are The Most Important Vitamins For Fighting Acne?
- EXCEL Tutorial - How to Construct a Compounding Interest Financial Calculator
- Take Vitamins for Energy
- 100 Top Action Verbs to Use to Write Powerful, Effective Resume Subheads that Will Win You the Job
- CCNA - CCNP Certification - Hands-On Lab Configuring Two Cisco Routers
- Hidden Secret of Your Personality
Ashada Bonalu 2022 in Telangana :బోనం అంటే ఏమిటి? బోనాల పండుగ జరుపుకునేందుకు గల కారణాలేంటో తెలుసా... have 227 words, post on telugu.boldsky.com at June 29, 2022. This is cached page on Health Breaking News. If you want remove this page, please contact us.